మన వాళ్లు కనిపెట్టారు: ఆ మూడు సముద్రాల్లో వేల కోట్ల సంపద
భారతదేశాన్ని రత్నగర్భ అంటారు. మన భూభాగంలోనే కాదు.. మన చుట్టూ ఉన్న సముద్ర ప్రాంతాల్లోను రత్నరాశులున్నాయి అంటారు. అదంతా అనంతమైన సంపద అంటారు. ఇప్పుడు అది వాస్తవ రూపంలోకి రానుంది. దేశానికి ఇరువైపులా ఉన్న సముద్ర ప్రాంతంలో కొన్ని కోట్ల టన్నుల లోహ, ఖనిజ సంపద ఉన్నట్లు గుర్తించింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI). మంగళూరు, చెన్నై, మన్నార్ పరీవాహక ప్రాంతం, అండమాన్, నికోబార్ ద్వీపాల్లో ఈ ఖనిజ సంపద గుర్తించింది GSI. మూడేళ్లపాటు నిర్వహించిన పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నారు. అత్యాధునిక సముద్ర రత్నాకర, సముద్ర కౌస్తుభ నౌకల ద్వారా జరిగిన ఈ పరిశోధనల్లో భాగంగా 1.8 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని సముద్రగర్భం తాలూకూ వివరాలను అత్యంత సూక్ష్మస్థాయిలో గుర్తించారు శాస్త్రవేత్తలు.
ఈ వివరాల ఆధారంగా మనకు మాత్రమే హక్కులున్న సముద్ర ప్రాంతంలో దాదాపు వెయ్యి కోట్ల టన్నుల సున్నపు మట్టి ఉన్నట్లు గుర్తించింది. అంతేకాకుండా కర్ణాటకలోని కార్వార్, మంగళూర్, చెన్నై ప్రాంతాల్లో ఫాస్ఫేట్, మన్నార్ నదీ పరీవాహక ప్రాంతంలోని చానెల్ లీవీలో గ్యాస్ హైడ్రేట్లు ఉన్నట్లు GSI పరిశోధనల ద్వారా స్పష్టమైంది








