హైదరాబాద్ నుంచి శ్రీలంకకు విమానం
భారత్ నుంచి శ్రీలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో వచ్చే నెల 8 నుంచి హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, కోయంబత్తూర్ల నుంచి నేరుగా విమానసేవలను నడపనున్నట్లు శ్రీలంకన్ ఏయిర్ లైన్స్ ప్రతినిధి సంజయ్ తిలకరత్నే తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ఈ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య పెరుగడానికి దోహదపడనున్నదన్నారు.








