నోట్ల రద్దు విజయవంతం ..త్వరలో లెక్క తేలుతుంది
జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్)తో సానుకూల ఫలితాలు వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్ల పాలనపై ఆయన గురువారం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న కొద్దీ దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు విజయవంతమైందని, ఎంత డబ్బు వెనక్కి వచ్చిందనేది త్వరలో లెక్కతేలుతుందని అన్నారు.








