ఈ నెల 23న ప్రణబ్ కు వీడ్కోలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి జులై 23న పార్లమెంట్ ఘనంగా వీడ్కోలు పలనుంది. ఉభయసభలు సంయుక్తంగా కలిసి ప్రణబ్‌కు వీడ్కోలు పలనున్నాయి. ఈ క్రమంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రణబ్ పదవీ కాలం జులై 24న ముగియనుంది. జులై 25న కొత్త అభ్యర్థి రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2012, జులై 25న 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీబాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, విపక్షాల అభ్యర్థి మీరాకుమార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.








