ఫైనల్లో పోరాడి ఓడిన భారత్
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో మిథాలీసేన ఓటమిపాలైంది. మహిళల వన్డే ప్రపపంచ కప్ కొద్దిలో చేజారింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 219 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 9 పరుగుల తేడాతో విజయం మహిళల ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది ఇంగ్లాండ్. నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచింది. వరుసగా వికెట్లు పడుతున్నా.. ఓపెనర్ పూనమ్ రౌత్(86), హార్మన్ ప్రీత్ కౌర్(51) విజయం కోసం తపించారు. మిడిలార్డర్ తడబాటుతో విజయం చేజారింది. చివర్లో దీప్తి శర్మ(14) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అన్య శ్రబ్సోలే ఆరు వికెట్లు తీసుకుని ఆ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. హలెక్స్ ఆర్ ట్లే రెండు వికెట్లు తీసుకుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. 63 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను నటాలీ షివర్(51), సారా టేలర్ (45), కేథరీన్ బ్రంట్(34) ఆదుకున్నారు. భారత బౌలర్లలో జులన్ గోస్వామి 3, పూనమ్ 2, రాజేశ్వరి ఒక వికెట్ తీసుకున్నారు.








