ఎప్పటికపుడు కొత్త టెక్నాలజీ : సీఈసీ
ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని వినియోగించుకుంటున్నామని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ నసీమ్ జైదీ వెల్లడించారు. ఎన్నికలను ఈసీ విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈవీఎంల పనితీరు అంశంలో ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని నిరూపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నమూనా ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా నసీమ్ జైదీ మాట్లాడుతూ ఈవీఎంలను తయారుచేసేటపుడే ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు టెక్నాలజీపై ఆధారపడుతున్నట్లు తెలిపారు. అత్యున్నత ప్రమాణాలను పాటించటమే తమ లక్ష్యమని సృష్టం చేశారు. ఓటు రసీదు యంత్రాలపై కొన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయన్నారు. ఇకపై ఓటు యంత్రాలతో కూడిన ఈవీఎంలు వినియోగిస్తామని తెలిపారు.








