దుబాయ్ టార్చ్ టవర్ లో భారీ అగ్ని ప్రమాదం
ఆకాశహర్మ్యాలకు నెలవైన దుబాయిలోని ఓ భారీ భవంతిలో అగ్ని ప్రమాదం సంభవించింది. 676 డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్లతో పాటు షాపింగ్ మాల్లు, ధీమ్ పార్కులకు నెలవైన టార్చ్ టవర్ ప్రపంచంలోనే 32వ ఎత్తయిన భవంతిగా వినుతికెక్కింది.ఈ భవంతిలోని 84వ అంతస్తులో మంటలు చెలరేగాయని సమాచారం. అయితే, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది భవనంలోని అందర్నీ ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. వేగంగా స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం.








