‘ఫేస్బుక్’ పోస్ట్ వివాదంలో డీఎస్పీ అరెస్టు
భారతీయ జనతా పార్టీ మహిళా ఎమ్మెల్యేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసోం పోలీసు ఉన్నతాధికారిని శనివారంనాడు అరెస్టు చేశారు. అసోం పోలీస్ శాఖలో డిఎస్పీగా పని చేస్తున్న అంజన్ బోరాను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠాతో మహిళా ఎమ్మెల్యేకు ప్రమేయం ఉందని, గౌహతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న ఆఫీస్ ఛాంబర్ నుంచి ఆమె ఈ వ్యవహారం నడుపుతున్నారని ఫేస్బుక్ పోస్టింగ్‌లో బోరా ఆరోపించారు. అయితే తన వాదనను బోరా సమర్ధించుకున్నారు. ఆర్ఎస్ఎస్ మాజీ నేత ఒకరు తనకు ఈ సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. కాగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని బోరా అరెస్టుపై అసోం పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ముఖేష్ సహాయ్ వ్యాఖ్యానించారు. రూ.10,000 వ్యక్తిగత పూచీకత్తుపై బోరా బెయిల్‌పై విడుదలయ్యారు.













