వైజర్సు బాలసుబ్రహ్మణ్యం దంపతులకు ఫెలోషిప్
ప్రముఖ సంగీత విద్యాంసులు డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం, వైజర్సు పావని దంపతులకు కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రతిష్ఠాత్మక సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ను ప్రకటించింది. సంగీత రంగంలో పరిశోధనలు చేయడం, గ్రంథాలను రచించడంతోపాటు సంగీత విద్యను భావితరాలకు అందిస్తూ ఎనలేని సేవలు చేస్తున్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రప్రభుత్వం వీరిని ఎంపికచేసింది. సంగీత పరిశోధకులు, సంగీత ఆచార్య అవార్డు గ్రహీత డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం ‘ఏ స్టడీ ఆఫ్ మ్యూజికల్ కంపోజిషన్స్ ఇన్ ద క్షేత్రాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ’ అన్న అంశంపై పరిశోధన చేశారు. వైజర్సు పావని మ్యూజికల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ-దెన్ అండ్ నవ్ అనే అంశంపై పరిశోధన చేసినందుకు రెండేండ్లపాటు ఫెలోషిప్‌ను అందుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ సేవలను గుర్తించి ఫెలోషిప్‌ను ప్రకటించడంపై బాలసుబ్రహ్మణ్యం, పావని కృతజ్ఞతలు తెలిపారు.








