డిసెంబరు 16న అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల ప్రదానం
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరపున అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల ప్రదానోత్సవాన్ని డిసెంబర్ 16న ఏలూరులో నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ వెల్లడించారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం, గీతం విశ్వవిద్యాలయాల వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తికి విద్యారత్న, సినీనటులు, నాటక రచయిత గొల్లపూడి మారుతీరావుకు సినీరత్న, చలన చిత్ర పంపిణీదారు, ఉషా ఫిలిమ్స్ అధినేత డాక్టర్ వి.వి. బాలకృష్ణరావుకు విశిష్ట వ్యాపార రత్న, ప్రజాకవి వంగపండు ప్రసాదరావుకు రంగస్థల రత్న పురస్కారాలను అందజేస్తామన్నారు. డాక్టర్ గుడారు జగదీష్‌కి వైద్యరత్న, మాయలూరి మనోహర్‌రెడ్డికి సేవారత్న, స్ఫూర్తిదాయక ప్రసంగకర్త షాకీర్ మహమ్మద్‌కు వినూత్న రత్న, మహిళా పైలెట్ కెప్టెన్ అన్నే దివ్వకు యువరత్న పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.













