మారనున్న దూరదర్శన్ ‘లోగో’.. దరఖాస్తులు ఆహ్వానం
ప్రభుత్వరంగ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ దూరదర్శన్ తన ‘లోగో’ను మార్చనున్నట్లు ప్రకటించింది. దీనికోసం ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్లు ప్రసారభారతి సీఈవో శశి శేఖర్ వెల్లడించారు.”మనుషి కన్ను” రూపంలో ఉండే ఇప్పటి లోగోను 1959లో దూరదర్శన్కు ఎంపిక చేశారు.అప్పటి నుంచీ అదే లోగో ప్రచారంలో ఉండగా 58 ఏళ్ల తర్వాత ఇప్పుడు లోగో మారబోతోంది.








