విమాన ప్రయాణం మరింత ప్రియం
దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియమైంది. చిన్న చిన్న పట్టణాలు, నగరాలకు విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రాంతీయ విమాన అనుసంధాన పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం దేశంలోని ప్రధాన నగరాల మధ్య తిరిగే విమాన ప్రయాణాలపై ఒక్కో విమాన ట్రిప్‌కు రూ.5,000 చొప్పున ప్రత్యేక లేవీ వసులు చేస్తున్నారు. దీనికి తోడు అయిల్ కంపెనీలు విమాన ఇంధన ధరను నాలుగు శాతం పెంచేశాయి. ఈ రెండు పరిణామాలతో ఒక్కో టిక్కెట్‌పై ప్రయాణికుల మీద రూ.100 అంతకంటే ఎక్కువ భారం పడుతుందని అంచనా.








