మూడో రోజు సోదాలు
కర్ణాటక ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ నివాసంలో మూడోరోజు శుక్రవారం కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఏరియాలోని ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ దాడుల ఘటనపై మంత్రి సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ మాట్లాడుతూ..ఇప్పటివరకూ ఐటీ శాఖ అధికారులు 70 చోట్ల దాడులు చేశారని, అయితే మంత్రి శివకుమార్ గానీ, ఆయన బంధువుల ఇళ్లల్లో ఎలాంటి నగదు లభించలేదన్నారు.








