జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులు దివాలాతీసే పరిస్థితి నెలకొంది: రాఘవులు
అనంతపురం: జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులు దివాలాతీసే పరిస్థితి నెలకొందని రాఘవులు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు నిరసనగా ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమాలు చేపడతామని సీపీఎం నేత రాఘవులు హెచ్చరించారు. మూడు రోజుల పాటు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి మధు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ హాజరయ్యారు.








