రాహుల్‌గాంధీ చైనా రాయబారిని కలిశారా?
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్‌లో చైనా రాయబారి లూ ఝాయావోయ్నితో భేటీ అయ్యారన్న వార్త సంచలన సృష్టించింది. రాహుల్ గాంధీ చైనా దౌత్యాధికారితో ఈ నెల 8న భేటీ అయ్యారనీ, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చర్చించారనీ చైనా దౌత్య కార్యాలయం ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఈ వార్తను తోసిపుచ్చింది. రాహుల్‌గాంధీ కార్యాలయం సైతం చైనా రాయబారితో ఎలాంటి సమావేశం జరగలేదంటూ సదరు ప్రకటనను ఖండించింది.








