రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ యాదవ్?
రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఉన్న అవకాశాలపై వివిధ ప్రతిపక్ష పార్టీలు చర్చిరచాయి. ప్రముఖ సోషలిస్టు నాయకుడు లిమాయ 95వ జయంతి వేడుకలు ఢిల్లీలో జరిగాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, జనతాదళ్(యునైటెడ్), సిపిఐ(ఎం)నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి నడుమ రాష్ట్రపతి ఎన్నికల అంశం చర్యకు వచ్చింది. ఎన్డిఎ అభ్యర్థికి సరైన పోటీదారుగా జెడియు నాయకుడు శరద్ యాదవ్ పేరు ఇందులో తెరపైకి వచ్చింది. ఆయనను బరిలోకి దింపితే మిగతా ఎన్డిఎ వ్యతిరేక పార్టీలు కూడా అభ్యంతరం చేప్పబోవని సమావేశం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో శరద్ యాదవ్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు పాల్గొన్నారు.








