వెంకయ్య నాయుడికి సీఎం కేసీఆర్ అభినందనలు
కేంద్రమంత్రి వెంకయ్యన్యాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆవాస పాలకమండలి అధ్యక్షపదవికి భారతదేశం ఎంపికకావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యను సీఎం అభినందించారు. ఆవాస పాలక మండలి అధ్యక్ష పదవిలో వెంకయ్య నాయుడు కొనసాగి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయగలరని కేసీఆర్ ఆకాక్షించారు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ మంచి నివాసాలు ఉండాలనే లక్ష్యం సాధించే దిశగా వెంకయ్య నేతృత్వంలో ప్రయత్నాలు జరగాలని సీఎం ఆకాంక్షించారు.








