తదుపరి సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా!
సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) కానున్నారు. తన వారసుడిగా ఈ పదవికి జస్టిస్ మిశ్రా పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ సిఫారసు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి ప్రకారం కేంద్ర న్యాయ మంత్రి లేఖ రాయగా, దానికి స్పందనగా తదుపరి సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా పేరును ప్రస్తుత సీజే ఖేహర్ సిఫారసు చేశారు.








