రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి, చివరి ఓటరుగా తెలుగువారే
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి, చివరి ఓటరుగా తెలుగువారే నిలిచారు. తొలిఓటరుగా సినీనటుడు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కె.చిరంజీవి పేరు నమోదుకాగా చిట్టచివరి(4,896వ) ఓటరుగా యనాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాడి కృష్ణారావు పేరు నిలిచింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే హక్కున్న సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ జాబితాను రూపొందించింది. తొలుత రాజ్యసభ, తర్వాత లోక్సభ, అనంతరం రాష్ట్ర అసెంబ్లీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారి పేర్లను అక్షరక్రమంలో రాష్ట్రాలవారీగా పొందుపరిచారు. ఈ మేరకు చిరంజీవి, కృష్ణారావుల పేర్లు తొలి, ఆఖరు స్థానాల్లో ఉన్నాయి.








