తొలి సైబర్ కోర్టు చైనాలో..
ఇంటర్నెట్కు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి తన తొలి సైబర్ కోర్టును చైనా ప్రారంభించింది. జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఈ–కామర్స్ సంస్థలకు కేంద్రమైన హాంగ్జూ నగరంలో ఈ కోర్టును ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో వాణిజ్య వివాదాలతో పాటు కాపీరైట్ చట్టం ఉల్లంఘనలను ఈ న్యాయస్థానం విచారిస్తుందని చైనా అధికారిక పత్రిక జిన్జువా పేర్కొంది.








