మనం కలలోనైనా చేయగలమా?
చైనా సుప్రీమ్ పీపుల్స్ కోర్టు 67.3 లక్షల మంది బ్యాంకు రుణాల ఎగవేతదారుల్ని బ్లాక్ లిస్ట్ చేయమని ఆదేశించింది… బ్లాక్ లిస్టు ఎక్కడ..? ఎందులో..? ఎలా..? విమానాల్లో ప్రయాణాలు చేయలేని విధంగా… కొత్తగా రూపాయి రుణం పుట్టకుండా… చివరకు క్రెడిట్ కార్డులు కూడా పనిచేయకుండా…! గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం… చైనా ప్రభుత్వం ఇప్పటికే 61.5 లక్షల మందిని విమానాల టికెట్లు కూడా కొనకుండా బ్లాక్ లిస్టు చేసింది… 22.2 లక్షల మంది అసలు హైస్పీడ్ ట్రెయిన్లలో ప్రయాణం కూడా చేయకుండా నిషేధించింది… పాస్‌పోర్టులు, ఐడీ కార్డుల ఆధారంగా దీన్ని అమలు చేస్తున్నట్టు సుప్రీమ్ పీపుల్స్ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చీఫ్ మెంగ్ జియాంగ్ చెబుతున్నాడు… 71 వేల మంది ఎగవేతదారులు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులుగా, ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేయకుండా ఆదేశాలు జారీ చేశారు… 5.5 లక్షల మంది రుణఎగవేతదారుల క్రెడిట్ కార్డుల దరఖాస్తులను ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా చెత్తబుట్టలో పారేసింది…













