హలో తో ఆత్మహత్యలకు చెక్
ఆత్మహత్య ఆలోచనలతో సతమతమయ్యేవారిని అప్పుడప్పుడూ ఫోన్ చేసి పలుకరించటం ద్వారా కాపాడవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. కొలరాడో, బ్రౌన్ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించాయి. ఆత్మహత్య ఆలోచనలతో కొట్టు మిట్టాడుతున్న వారికి ఫోన్ చేసి మాట్లాడడం ద్వారా వారిని రక్షించవచ్చని కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొంతసమయం వెచ్చించి నాలుగు మాటలు మాట్లాడితే వారిలో ఆ ఆలోచన తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలిందన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ముందుగా సమాజంతో తమ సంబంధాలను తెంచేసుకుంటారు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటిరిగా ఉండడానికే ఇష్టపడతారు. ఈ పరిస్థితుల్లో సమాజంతో సానుకూల బంధం ఏర్పడితే వారికి జీవితంపై ఆశలు చిగురిస్తాయి.













