ఆధ్యాత్మిక గురువు చంద్రస్వామి మృతి
ఆధ్యాత్మిక గురువు, వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామి(66) మరణించారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మూత్రపిండాల వ్యాధితో మరణించారు. గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ సంభవించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో ఆయనకు చాలా సాన్నిహిత్యం ఉండేది.








