నీతీశ్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు
బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణస్వీకారం చేసిన నీతీశ్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. చంద్రబాబు బీహార్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ మధ్య పరస్పర సహాయ సహకారాలు కొనసాగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు నీతీష్ ముఖ్యమంత్రితో అన్నారు. దానికి చంద్రబాబు స్పందిస్తూ బీహార్ అభివృద్ధికి తాము అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. ఉభయ రాష్ట్రాల మధ్య విజ్ఞాన మార్పిడిని కొనసాగిద్దామని బాబు ప్రతిపాదించారు. ఐదు నిమిషాల సేపు నీతీశ్‌తో చంద్రబాబు మాట్లాడారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.













