కేంద్రం సంచలన నిర్ణయం : గోవధపై నిషేధం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గోవధపై నిషేధం విధించింది. ఈ చట్టం ప్రకారం ఇకపై ఆవులు, గేదెలను మాంసం దుకాణాలకు అమ్మకూడదు. కేవలం రైతులకు మాత్రమే విక్రయించాలి. అదీ గుర్తింపు కార్డులున్న రైతులకు మాత్రమే అమ్మాలి. భూములున్న రైతులు మాత్రమే కొనుగోలు చేయాలి. గిత్తలను అస్సలు అమ్మకూడదు. ఎద్దులు, ఆవులు, గేదెలు, కోడెలతో పాటు ఒంటెల అమ్మకాలు ఇష్టానుసారంగా జరగకూడదు. ఈ కొత్త చట్టం రాబోయే మూడు నెలల్లో అమల్లోకి రానుంది. అమ్మకాలు, కొనుగోళ్లు జరిపే వాళ్లు కచ్చితంగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాల్సిందే. మరింత పేపర్ వర్క్ జరగాల్సి ఉండటంతో అమల్లోకి రావడానికి సమయం పడుతుందన్నారు. ఈ కొత్త చట్టాన్ని దివంగత పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే ఉండగానే రూపొందించారు. సుప్రీం కోర్టు సూచనతలో చట్టం రూపుదిద్దుకుంది.
చట్టంలో పొందుపర్చిన నిబంధనలు:
.. ఆవును కొనుక్కున్నవాళ్లు .. ఐదు రకాల ఆధారాలను కచ్చితంగా చూపించాలి. రెవెన్యూ ఆఫీస్, స్థానిక పశువైద్యుడు, పశువుల మార్కెట్ లో వీటిని అందించాలి.
.. పశువధకు కాదని.. వ్యవసాయానికి ఉపయోగిస్తున్నట్టు నిరూపించాలి.
.. జంతువధ నిరోధక చట్టం 1960కి అనుగుణంగా ఈ చట్టం చేశారు.








