ఏపీలో నూతన హైకోర్టు ఏర్పాటుకు సిద్ధం
భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన హైకోర్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. హైకోర్టు విభజనపై ఆయా న్యాయస్థానాల్లో స్టేలు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొని ఉండాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన చెప్పారు. సుదీర్ఘకాలంగా హైకోర్టులో ఉన్న పెండింగ్ కేసులు పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులను కోరినట్లు ఆయన చెప్పారు.








