చానెల్స్ పేరుతో లోగోలు పట్టుకొని తిరిగే వారిపై కేంద్రం కొరడా..
చానెల్ ముసుగులో దాడులకు పాల్పడే అవకాశం
కేంద్ర ఇంటిలిజెన్స్ హెచ్చరికలు..
అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం…
మీడియాతో సంబంధం లేకుండా నేరుగా యూ ట్యూబ్ చానెల్ ను నిర్వహిస్తున్న వారిపై నిఘా..
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా రకరకాల చానెల్ పేరుతో లోగోలు దర్శనమిస్తున్నాయి. శాటిలైట్ చానెల్స్ కంటే యూ ట్యూబ్ చానెల్స్ సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అనుమతులతో పని లేదు. చానెల్ వాస్తుందా రాదా అనవసరం. చేతిలో లోగో ఉంటే చాలు చానెల్ ప్రతినిధి కింద లెక్కే. చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలకు, ప్రభుత్వ అధికారులకు సమాన్య ప్రజలకు అవి చానెల్సో కాదో తెలియని పరిస్ధితి. దీంతో ఎవరికి వారే సొంత చానెల్ పెట్టుకుని తామె చానెల్ ఓనర్ లా ఫీలవుతున్నారు. మామూలు నగరాల్లో ఐతే పరవాలేదు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో మరియు బాగా విస్తరిస్తున్నా ఆంధ్ర తెలంగాణ లోని కొత్త జిల్లా ల్లో ఉన్నాయని ఇవి ఇంటిలిజెన్స్ విభాగానికి ఈ యూ ట్యూబ్ చానెల్స్ సవాలు విసురుతున్నాయి. ముఖ్యంగా సంఘ విద్రోహ శక్తులు, వారితో సంబంధం ఉన్న వారు సైతం మీడియా ముసుగును కప్పుకోవడానికి యూ ట్యూబ్ చానెల్స్ ను ఆయుధంగా మలచుకుంటున్నారు.
ఏదో ఒక పేరుతో చానెల్ ను పెట్టి…రిపోర్టర్లుగా చలామణి అవుతున్నారు. ఇప్పటికిప్పుడు వీరి వల్ల ప్రమాదం లేకపోయినా ఎప్పుడైనా అది జరగవచ్చని ఇంటిలిజెన్స్ హెచ్చరిస్తోంది. డబ్బుకు ఆశపడి ఎవరైనా తీవ్రవాదులకు అమ్ముడు పోతే పెను విధ్వంసం జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కీలకమైన నేతలను, కీలకమైన స్ధావరాలను కీలక సమాచారాన్ని తస్కరించడానికి యూ ట్యూబ్ చానెల్ ప్రతినిధులను ఉపయోగించుకునే అవకాశం ఉందనేది ఈ హెచ్చరికల సారాంశంగా తెలుస్తోంది. దీంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది. అక్రిడేషన్ జర్నలిస్ట్ ల కు మాత్రమే మంత్రులు, ఎంఎల్ఎ లా సమాచారం ఇవ్వలని యూట్యూబ్ ఛానల్స్ ఎలాంటి సమాచారం కాని అక్రిడేషన్ కార్డు లు జారీ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.








