ప్రణయ్‌రాయ్ ఇంటిపై సీబీఐ దాడులు
ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. సంస్థకు చెందిన ఇతర కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించింది. రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించ కుండా ఓ ప్రైవేటు బ్యాంక్‌కు నష్టం చేకూర్చారన్న అభియోగంపై సీబీఐ దాడులు చేసింది. ణయ్రాయ్, ఆయన భార్య రాధిక, వారికి చెందిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్, కొందరు ఐసీఐసీఐ బ్యాంకు అధికారులపై నేరపూరిత కుట్ర, అవినీతి, మోసం కింద కేసులు నమోదు చేసిన సీబీఐ సోమవారం ఈ దాడులు జరిపింది.








