BSNL బీభత్సమైన ఆఫర్ : అన్ లిమిటెడ్ కాల్స్.. రోజుకు 1GB డేటా
ఆఫర్ల మీద ఆఫర్ల గుప్పిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి టెలికాం సంస్థలు. ముఖ్యంగా జియో ప్రత్యేక ఆఫర్లతోపాటు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ తమ రెగ్యులర్ వినియోగదారులతో పాటు కొత్త వారిని ఆకర్షిస్తోంది. దీంతో టెలికాం సంస్థ మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఇప్పటికే కొన్ని సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL. తన కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది.
రూ.429తో రీఛార్జ్ చేసుకోవడంతో 90 రోజుల పాటు ఏ నెట్వర్క్కు అయినా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవడంతో పాటు… రోజూ 1జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది.
రూ.429కే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్… రోజుకు 1జీబీ డేటా పథకాన్ని అందిస్తున్నట్లు BSNL బోర్డు డైరెక్టర్ ఆర్.కె. మిత్తల్ తెలిపారు. అంటే నెలకు రూ.143 మాత్రమే ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పథకాల్లో ఇది ఉత్తమమైనదని తెలిపారు.








