బీజేపీకి జేడీయూ హ్యండ్
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యనాయుడుకు తాము మద్దతివ్వబోమని జేడీయూ కుండబద్దలు కొట్టేసింది. దీంతో బీజేపీ ఇరకాటంలో పడింది. తమకు తప్పక మద్దతిస్తారని భావించిన జేడీయూ హ్యండ్ ఇవ్వడంతో బీజేపీ నేతలు ఖంగుతిన్నారు. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ ను బలపరిచిన సందర్భంలో నితీశ్ అందుకు భిన్నంగా రామ్ నాథ్ కు మద్దతు తెలిపి విపక్షాలకు షాక్ ఇచ్చారు. ఇపుడు అదే తరహాలో ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ నేతలు అయోమయానికి గురవుతున్నారు.








