ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన అమిత్ షా
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గుజరాత్‌లోని నరన్పురా నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన విక్టరీ సాధించారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన గాంధీనగర్‌లో ఉన్న మహాత్మ మందిర్‌ను సందర్శించారు. ఆయనతో పాటు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ కూడా వెళ్లారు. గుజరాత్ నుంచి బీజేపీ ఎంపీలుగా ఎన్నికైన అమిత్ షా, స్మృతీ ఇరానీలకు ప్రధాని మోదీ కంగ్రాట్స్ చెప్పారు.








