గుడిని మాత్రం కూల్చేయలేము… స్వామి
మసీదులను కూల్చివేయొచ్చు గాని హిందూ ఆలయాలను కూలదోయలేమని బీజేపీ సీనియర్ నేత ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. గుడిని ఎందుకు కూల్చేయలేమో చెబుతూ ఆలయంలోని విగ్రహంలో దేవుడు ప్రతిష్ఠితమై ఉంటాడని,. అదే మసీదు అయితే కేవలం ముస్లింలు ప్రార్థనలు జరుపుకునేందుకే నిర్మించుకుంటారని ఆయన తనదైన శైలిలోఅసలు కారణాన్ని వెల్లడించారు. ఈ కారణంగానే మసీదును కూల్చివేసినా ఫరవా లేదు గానీ… గుడిని మాత్రం కూల్చేయలేమని స్వామి చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన చేసిన ఓకామెంట్ పెద్ద చర్చకే తెర తీసేలానే ఉంది.







