బిజెపి సంబురం
ఉప రాష్టప్రతిగా ఎం. వెంకయ్య నాయుడు ఘన విజయం సాధించడంతో బిజెపి రాష్ర నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఉప రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించినట్లు ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడడంతోనే నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.








