ICC ఉమెన్స్ వరల్డ్ కప్: పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్
ICC మహిళల వన్డే వరల్డ్ కప్ లో భారత్ … పాకిస్తాన్ పై 95 పరుగుల ఆధిక్యతతో ఘన విజయం సాధించింది. నార్త్ సౌండ్ అంటిగ్వా వేదికగా …భారత్ తో జరిగిన మ్యాచ్ లో లక్ష్య చేధనలో పాకిస్తాన్ 38.1 ఓవర్లలో కేవలం 74 పరుగలకే కుప్పకూలింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగలు చేసింది. తర్వాత 170 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ చేపట్టిన పాక్ లక్ష్య చేధనలో ఘోరంగా విఫలమైంది. భారత బౌలింగ్ ధాటికి పాక్ ప్లేయర్లు విలవిల్లాడారు. పాక్ సారథి సనా మీర్ (29) తప్ప మిగతా ప్లేయర్స్ సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ బాటపట్టారు.
భారత బౌలర్లు బీస్ట్ 5, జోషి 2, శర్మ, గోస్వామి, కౌర్ తలో వికెట్ తీసుకుని భారత్కు విజయాన్ని అందించారు. దీంతో టోర్నీలో భారత్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతోంది.








