పాస్‌పోర్ట్‌కి బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు
పాస్‌పోర్ట్ జారీ నిబంధనలను సులభతరం చేయడంలో భాగంగా బర్త్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి జాబితా నుంచి తొలగించింది ప్రభుత్వం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ, ఎల్ఐసీ పాలసీ, టెన్త్ సర్టిఫికెట్ ఉంటే చాలని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. పార్లమెంట్లో ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పాస్‌పోర్టును మరింత సులువుగా పొందేందుకు వీలుగా విదేశాంగశాఖ నిబంధనలను సులభతరం చేసింది. డేట్ ఆఫ్ బర్త్ కోసం గతంలో ఉన్న రూల్స్ ప్రకారం 1989, జనవరి 26న లేదా ఆ తర్వాత జన్మించిన వాళ్లు బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా ఇవ్వాలన్న నిబంధన ఉండేది కానీ ఇప్పుడా నిబంధననను విదేశాంగ శాఖ తొలగించింది. 60 ఏళ్ల పైబడ్డవారు, 8 ఏళ్ల లోపు చిన్నారులకు పాస్‌పోర్టు ఫీజులో 10 శాతం రాయితీ ఇవ్వనున్నామని తెలిపారు.













