అద్వానీకి భారత్రత్న?
బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు అత్యున్నత పౌరపురస్కారం భారత్ రత్నతో సత్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఈ ప్రతిపాదన ప్రాధమిక దశలోనే ఉన్నదని అద్వానీ సన్నిహితులొకరు తెలిపారు.








