పద్మభూషణ్‌కు నామినేట్ అయిన ధోనీ
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి మరో అరుదైన గౌరవం దక్కనుంది. భారత జట్టుకు ధోనీ అందించిన సేవలకుగాను ఆయన పేరును పద్మభూషణ్ అవార్డు కోసం బిసిసిఐ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ధోనీ నాయకత్వంలో టీమిండియా రెండు వరల్డ్ కప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు మరిన్ని విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రమే కొనసాగుతున్న ధోనీ అద్భుత ప్రదర్శనలతో జట్టుకు విజయాలను సాధించి పెడుతున్నాడు. గత రెండు సిరీస్ లలో పాత ధోనీని గుర్తు చేస్తూ ఆయన ఆడిన ఇన్నింగ్స్ లను మరిచిపోలేము. ప్రస్తుతం మంచి ఫామ్ తో పాటు ఫిట్‌నెస్‌లో సత్తాచాటుతున్న ధోనీ 2019 వరల్డ్ కప్ ఆడాలని ప్రతి సగటు భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు.








