RBI: బ్యాంకు మారినా నెంబర్ అదే
బ్యాంకులు కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించేందుకు చర్యలు చేపట్టింది రిజర్వ్ బ్యాంక్. .. ఒక బ్యాంకు సర్వీసులపై అసంతృప్తితో వేరే బ్యాంకుకు మారినా.. లావాదేవీల సౌలభ్యం కోసం పాత ఖాతా నంబరునే కొనసాగించుకునే వెసులుబాటు కల్పించేలా నిర్ణయం తీసుకుంది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ తరహాలోనే అకౌంటు నంబరు పోర్టబిలిటీని అందుబాటులోకి తెచ్చి… అమలు చేసే దిశగా బ్యాంకులు కసరత్తు చేయాలని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా సూచించారు.
మరింత పోటీతత్వంతో పనిచేసేందుకు.. ఖాతాదారులకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. బ్యాంకింగ్ అంబుడ్స్మన్ వార్షిక సదస్సులో పాల్గొన్న ముంద్రా చేసిన వ్యాఖ్యలపై RBI సోమవారం (జులై 31) ప్రకటన విడుదల చేసింది. టెక్నాలజీని విస్తృతంగా వినియోగించే కొత్త తరం ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంపై బ్యాంకులు దృష్టి సారించాలని ఆయన తెలిపారు.








