కె.విశ్వనాథ్ గొప్ప దర్శకుడు: దత్తాత్రేయ
కేంద్ర కార్మిక మరియు ఉపాధికల్పనశాఖామాత్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు మరియు శాసనసభ్యులు శ్రీ చింతల రామచంద్రా రెడ్డి గారు నేడు 7 మే, 2017 తేదీన దాదా సాహెబ్ ఫాల్కేఅవార్డు గ్రహీత శ్రీ కె. విశ్వనాధ్ గారిని వారి నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ బండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ “గొప్ప దర్శకుడు, రచయిత,నటుడైన కళాతపస్వి శ్రీ కె. విశ్వనాధ్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తెలుగువారందరికీ గర్వకారణమని, ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ సంస్కృతిని, కుటుంబంలోని మానవ సంబంధాలను తెరకెక్కించడంలో విశ్వనాధ్గారికి ఎవరూ సాటిరారని, వారు దర్శకత్వం వహించిన శంకరాభరణం, సాగర సంగమం సినిమాలుసి.ఎన్ఎ.న్ ఐ.బి.ఎన్ లిస్ట్ ఆఫ్ 100 గ్రేట్ ఇండియన్ ఫిలిమ్స్ లో చోటుచేసుకోవడం వారి ఘనతఅని మరియు స్వాతి ముత్యం సినిమా 59 వ ఆస్కార్అవార్డులకు అధికారికంగా నామినెటేఅవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం అని తెలిపారు. ఇంత గొప్ప దర్శకులైనప్పటికీఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణమైన జీవితాన్ని గడుపుతుండడం వారిగొప్పతనమని శ్రీ బండారు దత్తాత్రేయ గారు పేర్కొన్నారు.













