బళ్లారి హైదరాబాద్ మధ్య ట్రూజెట్ సేవలు
కర్ణాటకలోని ఉక్కునగరి బళ్లారి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్కు ఉడాన్ పథకం కింద విమానసేవలు ప్రారంభమయ్యాయి. జిందాల్ విజయనగర విమానాశ్రయం నుంచి ట్రూజెట్ విమాన సేవలను కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ప్రారంభించారు. 70 మంది ప్రయాణించే సౌలభ్యం ఉన్న ఈ విమానం రోజూ హైదరాబాద్లో ఉదయం 6:20కి బయలుదేరి 7:25కి బళ్లారి చేరుతుంది. తిరిగి బళ్లారిలో 7:55కి బయలుదేరి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.








