వాటాల విక్రయానికి ప్రేమ్ జీ ప్రయత్నాలు
ఐటి రంగంలో నెలకొన్న సంక్షోభంతో విప్రోలో తనకు, తన కుటుంబానికి ఉన్న వాటాను పూర్తిగా లేదా పాక్షికంగా అమ్మేయాలని అజిమ్ ప్రేమ్‌జీ నిర్ణయించినట్టు మనీకంట్రోల్.కామ్ ఒక కథనంలో తెలిపింది. కంపెనీ విలువను సరిగా మదింపు చేయడం కోసం ప్రేమ్‌జీ కుటుంబం ఇప్పటికే ఒకటి కంటే ఎక్కువ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకులను సంప్రదించినట్టు మార్కెట్లో వార్తలు వినిపిస్తున్నాయి.








