ఆన్ లైన్ లో ఆస్ట్రేలియా వీసాలు
పర్యటన నిమిత్తం వచ్చే భారతీయులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెసులుబాటు కలిగించింది. వారికి జులై ఒకటి నుంచి ఆన్లైన్ లో విజిటర్ వీసా ఇవ్వనుంది. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో 65 వేల మందికి విజిటర్ వీసాలు మంజూరు చేసింది. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చే భారతీయుల సంఖ్య పెరుగుతోందని, అందువల్ల మరింత సులువుగా వీసాలు లభించేలా ఈ ఏర్పాటు చేసినట్టు ఆ దేశ వలసలు, సరిహద్దు రక్షణ శాఖ సహాయ మంత్రి అలెక్స్ హాక్ తెలిపారు. ఆన్లైన్లో చెల్లింపులు జరుపుకోవడంతో పాటు, దరఖాస్తు ఏ దశలో ఉందీ తెలుసుకోవచ్చు.








