అసెంబ్లీ సీట్ల పెంపు పై ముందడుగు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా మరో ముందడుగు పడింది. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సీట్లు పెంచుకోవడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి కేంద్ర న్యాయశాఖ పచ్చ జెండా ఊపినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫైలుకి న్యాయ శాఖ ఆమోద ముద్ర వేసి హోం శాఖకు పంపినట్లు సమాచారం. ఇప్పటివరకూ అసెంబ్లీ సీట్ల పెంపుకు అడ్డంగా ఉన్న ఆర్టికల్ 170(3)కి చిన్న సవరణ చేస్తే సరిపోతుందని న్యాయ శాఖ అభిప్రాయపడినట్లు తెలిసింది. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 2019 నాటికి అసెంబ్లీ సీట్లు పెంచాలంటే ఆర్టికల్ 170(3)కి సవరణ చేయాల్సిందేనని గత అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ చెప్పారు. ఆయన అభిప్రాయానికి అనుగుణంగానే ఇప్పుడు న్యాయ శాఖ సవరణలు సూచించినట్లు సమాచారం.








