విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవనున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులు జరుగుతున్నాయని, ఈపనులు పూర్తయితే పెద్ద విమానాలు దిగుతాయన్నారు. అన్ని వసతులతో కూడిన టెర్మినల్‌ను ఇప్పటికే ప్రారంభించామన్నారు. అలాగే అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చాయని, భూసేకరణ పూర్తికాగానే నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.













