నీతి ఆయోగ్ కు అరవింద్ పనగడియా గుడ్ బై
నీతి ఆయోగ్ తొలి వైస్ చైర్మన్ అరవింద్ పనగడియా రాజీనామా చేశారు. ఈ నెల 31 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఆర్బీఐ మాజీ చైర్మన్ రఘురామ్ రాజన్లాగే తాను కూడా అమెరికా వెళ్లి విద్యా బోధనలో కొనసాగనున్నట్లు పనగడియా తెలిపారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను తెచ్చిన విషయం తెలిసిందే. దీనికి తొలి వైస్ చైర్మన్ అరవింద్ పనగడియానే. ఈ పదవి చేపట్టక ముందు ఆయన యూఎస్‌లోనే విద్యాబోధనలో ఉండేవారు. ఆయన రాజీనామాకు కచ్చితమైన కారణం తెలియకోపోయినా, తిరిగి బోధన చేయాలన్న ఆసక్తితోనే ఆయన వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చిన మోదీనే అరవింద్ పనగడియాను ప్రత్యేకంగా పిలిచి ఈ బాధ్యతలు అప్పగించారు.








