లండన్ నుంచి బయలుదేరిన నారాయణ
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిశీత్(22) మృతి చెందారు. ప్రస్తుతం మంత్రి నారాయణ లండన్ పర్యటనలో ఉన్నారు. కుమారుడి మరణ వార్త తెలియగానే ఆయన హుటాహుటిన భారత్కు బయలుదేరినట్లు సమాచారం. మరోవైపు నిశీత్ మృతిచెందిన వార్త తెలియగానే ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.








