అనిల్ అంబానీకి అంతర్జాతీయ గౌరవం
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి అంతర్జాతీయ గౌరవం దక్కింది. అమెరికాలోని అట్లాంటిక్ కౌన్సిల్ బోర్డు సభ్యుడిగా ఎంపిక అయ్యారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ప్రపంచ థింక్ ట్యాంక్ అట్లాంటా కౌన్సిల్ తన అంతర్జాతీయ సలహా బోర్డులో సభ్యుడిగా చేరాలని ఆహ్వానించింది. భారతదేశానికి ప్రముఖ వ్యాపారవేత్తను అనిల్ అంబానీని అట్లాంటిక్ కౌన్సిల్ లోకి తీసుకున్నట్లు అట్లాంటా కౌన్సిల్ వెల్లడించింది. సౌత్ ఆసియాలో ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ నుంచి అనిల్ అంబానీని ఎంపిక చేయడం సంతోషమని సంస్థ చైర్మన్ జాన్.ఎం.హంట్స్ మాన్ పేర్కొన్నారు.













