తెలుగు రాష్ట్రాల గవర్నర్గా ఆనందీబెన్?
తెలుగు రాష్ట్రాల కొత్త గవర్నర్ గా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ను కేంద్రంలో కీలక పదవిని అప్పగించాలన్న యోచనలో ప్రధాన నరేంద్ర మోడీ ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ భద్రతా మండలిలో నరసింహన్కు చోటు ఇవ్వడమో లేదా సలహాదారుడిగా నియమించ వచ్చన్న ప్రచారం జరుగుతోంది. నరసింహన్ స్థానంలో ఆనందీబెన్కు బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. తెలుగు రాష్ట్రాలకు ఆమెను గవర్నర్గా ఎంపికచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.








