కేంద్ర కేబినెట్ లోకి అమిత్ షా?
గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ప్రధాని నరేంద్రమోదీ త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనకు హోం, రక్షణ శాఖలలో ఒకటి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు గుజరాత్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అమిత్‌షాను కేబినెట్లో చేర్చుకోడానికే ప్రధాని మోదీ ఆయనను రాజ్యసభకు తీసుకొస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.








