తెదేపాతో మైత్రి కొనసాగుతుంది: అమిత్షా
తెదేపాతో తమ మైత్రి కొనసాగుతుందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా స్పష్టంచేశారు. ఆ పార్టీతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త స్నేహితుల ప్రస్తావన అవసరం లేదన్నారు. భాజపాతో వైకాపా పొత్తు అంశంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాంటి వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోరాడతామన్నారు. కొన్ని పార్టీలే కాదు దేశం మొత్తం భాజపాతో టచ్లో పేర్కొన్నారు.








